ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదగిరికొండపై హరిహరులకు విశేషపూజలు

ABN, First Publish Date - 2022-10-11T05:46:30+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు.

కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట, అక్టోబరు 10: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. స్వయంభువుడికి పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో, అనుబంధ శివాలయంలో శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన పూజారులు గర్భాలయంలోని మూలమూర్తులకు, సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులకు పంచామృతాభిషేకం జరిపి తులసీ దళాలతో అర్చించారు. దివ్యమనోహరంగా అలంకరించిన ఉత్సవమూర్తులకు అష్టభుజి ప్రాకార మండపంలో విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను నిర్వహించారు. అదేవిధంగా శివాలయంలో సహస్రనామ పఠనాలతో  బిల్వపత్రార్చనలు జరిపారు. ప్రధానాలయంతో పాటు శివాలయ ంలో అలంకార, వెండిజోడు సేవలు నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.51,13,569 ఆదాయం వచ్చిందని, ఇందులో ఇతరాల ద్వారా రూ.28,33,280 ఆలయ ఖజానాలో జమ అయినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

నిలిచిన హెడ్‌ కౌంటింగ్‌

యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్యను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన హెడ్‌కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచింది. ప్రధానాలయ తూర్పు రాజగోపురం ముందు హెడ్‌కౌంటింగ్‌ కోసం ఏర్పాటుచేసిన కెమెరాలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. త్వరలో లోపాలను సరిచేసి క్షేత్రానికి వచ్చిన భక్తుల సంఖ్యను తెలియజేస్తామని అధికారులు తెలిపారు. 

అన్నా.. గుడిని ఎవరు అభివృద్ధి చేశారు? : మంత్రి ఎర్రబెల్లి  

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారని దేవదేవుడి దర్శనానికి వచ్చిన భక్తులను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అడిగారు. అందుకు భక్తులు ముక్తకంఠంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదగిరిగుట్టను అభివృద్ధి చేశారని బదులిచ్చారు. యాదగిరీశుడిని ఆయన సోమవారం దర్శించుకుని, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ప్రధానాలయంలో పూజలనంతరం సప్తతల మహారాజగోపురం ముందున్న వేంచేపు మండపంపై కాసేపు సేదతీరి గుట్టకు వచ్చిన భక్తులతో ముచ్చటించారు. యాదగిరిగుట్ట క్షేత్రానికి భక్తులు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని అడిగి తెలుసుకుని సరదాగా వారితో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఆయన వారితో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ యాదగిరిక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. 



Updated Date - 2022-10-11T05:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising