ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకకాలంలో రూ.2లక్షల రుణాల మాఫీ

ABN, First Publish Date - 2022-05-28T06:41:16+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ 

డిండి, మే 27: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు శుక్రవారం మండలంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని గోనకోలు, డిండి, జేత్యతండా, కాలియతండా, బొగ్గులదొన, ప్రతా్‌పనగర్‌, టి.గౌరారం గ్రామాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల సమస్యలను రచ్చబండలో అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొగ్గులదొన గ్రామంలో మాట్లాడుతూ రైతుబంధును ఎకరాకు రూ.15 వేలకు పెంచుతామని అన్నారు. పక్కా ఇళ్లులేని వారికి సొంత స్థలాలలో రూ.6లక్షలు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఓట్లు వేయించుకున్న కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. యువకులు, మహిళలు, రైతులను దగా చేసిన కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారని అన్నారు. మిగులు రాష్ట్రమైన తెలంగాణను అప్పు ల రాష్ట్రం చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిగి దిగజార్చారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజే్‌షరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, నాయకులు సిరాజ్‌ఖాన, రవినాయక్‌, తిప్పర్తి రుక్మారెడ్డి, లక్‌పతినాయక్‌, భీముడు, సర్పంచ నాగేశ్వర్‌రావు, దినేష్‌, సాయిబాబు, తీజ్‌, ఈదమయ్య, మల్లేష్‌, శ్రీను, ప్రసన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T06:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising