ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృత్తి నైపుణ్య శిక్షణతో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు

ABN, First Publish Date - 2022-01-26T05:56:15+05:30

నైపుణ్య శిక్షణతో యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు

కేవీకేలో ఆధునిక పద్ధతిలో సాగును ఎమ్మెల్యే సైదిరెడ్డికి వివరిస్తున్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి రూరల్‌, జనవరి 25 : నైపుణ్య శిక్షణతో యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో ఏర్పాటుచేసిన శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్థుత పరిస్థితుల్లో యువత వ్యవసాయంతో పాటు ఉద్యానవన, చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం వంటివి చేపట్టాలన్నారు. త్వరలో గడ్డిపల్లిలో ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని కేవీకే సంస్థ కార్యదర్శి ఘంటా సత్యనారాయణరెడ్డి తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ బి.లవకుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడియం వెంకటరెడ్డి, ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాసగౌడ్‌, సర్పంచ్‌ సుందరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మేకల స్రవంతిశోభన్‌బాబు, స్వర్ణశ్రీనివాసరెడ్డి, శ్రీహరి, శాస్త్రవేత్తలు కిరణ్‌, మాధురి, నరేష్‌, సుగంధి, ఆదర్శ్‌, బి.సత్య నారాయణరెడ్డి, సిబ్బంది  పాల్గొన్నారు.

తండాల అభివృద్ధి టీఆర్‌ఎ్‌సతోనే సాధ్యం

పాలకవీడు : తండాల అభివృద్ధి టీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని మీగడంపాడుతండాలో రూ.20 లక్షల ఎస్డీఎఫ్‌ నిధులతో సీసీ రోడ్డు పనులను మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. ఇటీవల హత్యకు గురైన శూన్యపహాడ్‌ గ్రామానికి చెందిన రమావత్‌ జయేందర్‌నాయక్‌ తల్లిదండ్రులను పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మలమంటి దర్గారావు, రవి, వెంకట్‌రెడ్డి, సతీష్‌, సైదులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T05:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising