ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యనారాయణ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు

ABN, First Publish Date - 2022-06-26T07:15:57+05:30

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేసిన శీలబోయిన సత్యనారా యణ(86)మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

సత్యానారాయణ మృతదేహానికి నివాళులర్పిస్తున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, జూన్‌ 25: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేసిన శీలబోయిన సత్యనారా యణ(86)మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని  సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో నిర్వహించిన  సత్యనారాయణ అంత్యక్రియల్లో వారు పాల్గొన్నారు. మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో, కుడి, ఎడమ కాల్వల డిజైన్‌ చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు  డిజైనింగ్‌లో ముఖ్యమైన ముగ్గురు ఇంజ నీర్లలో సత్యనారాయణ ఒకరన్నారు. మధ్య తరగతి నీటి పారుదల శాఖలో చీఫ్‌ ఇంజనీర్‌గా రిటైరయ్యారన్నారు. అరకులో శారదానికేతన్‌ పాఠ శాలను స్థాపించి 1000మంది పిల్లలను చదివిస్తున్నారన్నారు.  ఈ కార్య క్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరసింగరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవరావు, ఏఈ సత్యనారా యణరావు, డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జుట్టుకొండ బసవయ్య, ముత్యాలు, వెంకట్‌రెడ్డి, సైదులు, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T07:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising