ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-24T06:50:20+05:30

వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభం కాకముందే సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఆరో స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ తోటకూరి అనురాధ అన్నారు. సోమవారం స్థానిక జడ్పీ కార్యాలయం లో (సాంఘీక సంక్షేమం) 6వ స్థాయీ సంఘం సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న తోటకూరి అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆరో స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ అనురాధ 

భువనగిరి రూరల్‌, మే 23: వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభం కాకముందే సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఆరో స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ తోటకూరి అనురాధ అన్నారు. సోమవారం స్థానిక జడ్పీ కార్యాలయం లో (సాంఘీక సంక్షేమం) 6వ స్థాయీ సంఘం సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా విడుదలైన ఉద్యోగ నోటీఫీకేషన్లకోసం ప్రారంభమైన ఉచిత కోచింగ్‌ కేంద్రాల్లో అభ్యర్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. దివ్యాంగులకోసం ప్రభుత్వం మంజూరు చేసిన వీల్‌చైర్లు, చేతికర్రల ఉపకరణాలు అర్హులకు అందే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. 5వ స్థాయీ సంఘం (స్ర్తీ శిశు సంక్షేమ) కమిటీ సమావేశం గోలి ప్రణీత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, పిల్లలకు సమతుల పౌష్టికాహారం అందించాలన్నారు. 3వ స్థాయీ సంఘం (వ్యవసాయం) సమావేశం సుబ్బూరు బీరుమల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ధాన్యం సేకరణ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించి రైతుల నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో 30లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, సభ్యులు పున్న లక్ష్మీ, జి.జోసఫ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు యాదయ్య, ధనుంజయ్య, మంగ్తా నాయక్‌, శ్యాంసుందర్‌, సీడీపీవో స్వరాజ్యం పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising