ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవే వ్యాపారులపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పిడుగు

ABN, First Publish Date - 2022-09-29T05:56:58+05:30

చౌటుప్పల్‌ వ్యాపారుల ఆశలపై ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్డు) పిడుగుపడింది. పట్టణ సమీపాన విజయవాడ రోడ్డువైపు ఆర్‌ఆర్‌ఆర్‌ జంక్షన్‌కోసం గతంలోనే హద్దులు ఏర్పాటుచేశారు. జంక్షన్‌ ప్రాంతంలోనే భూసేకరణ ఉంటుందని అంతా భావించారు.

హైవేపై కోల్పోనున్న మడిగెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

250 మడిగెలు కోల్పోతున్న వ్యాపారులు


చౌటుప్పల్‌ రూరల్‌, సెప్టెంబరు 28:  చౌటుప్పల్‌ వ్యాపారుల ఆశలపై ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్డు) పిడుగుపడింది. పట్టణ సమీపాన విజయవాడ రోడ్డువైపు ఆర్‌ఆర్‌ఆర్‌ జంక్షన్‌కోసం గతంలోనే హద్దులు ఏర్పాటుచేశారు. జంక్షన్‌ ప్రాంతంలోనే భూసేకరణ ఉంటుందని అంతా భావించారు. ఆప్రాంతంలో మడిగెలు, ప్లాట్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. కానీ ఇటీవల జంక్షన్‌ నిర్మాణం, సర్వీసు రోడ్డుకోసం భారీగా భూసేకరణ చేయాలని నిర్ణయించి మార్కింగ్‌ చేశారు. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. మార్కింగ్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విజయవాడ రోడ్డులో ఉత్తరంవైపు ఎల్‌ఎన్‌ఎ్‌స బార్‌ నుంచి, చేనేత సహకార సంఘం కాంప్లెక్స్‌ మీదుగా తడకమల్ల కృష్ణమూర్తి వెంచర్‌, పాండు సర్వీ్‌ససింగ్‌ సెంటర్‌వరకు పూర్తిగా మడిగెలు, ప్లాట్లను తొలగించనున్నారు. ఒకవైపు దాదాపు 150 మడిగెలు, ప్లాట్లు కోల్పోతున్నారు. దక్షణంవైపు సబ్‌స్టేషన్‌ నుంచి మారుతి కొటెక్స్‌, శ్రీని పరిశ్రమ, సూర్యోదయ పరిశ్రమ వరకు మడిగె లు, ప్లాట్లను తొలగించనున్నారు. దక్షిణంవైపు సైతం 50 మడిగెలు, ప్లాట్లు, భూములుపోతున్నాయి. తూర్పున ఎన్‌హెచ్‌ 9 హోటల్‌ మీదుగా జంక్షన్‌ ప్రాం తంవరకు హద్దులు నాటారు. రోడుకు ఇరువైపులా 250కి పైగా మడిగెలు, ప్లాట్లు, 80ఎకరాల భూమి జంక్షన్‌, సర్వీసురోడ్డుకోసం సేకరించనున్నారు. ఎన్నో ఏళ్లుగా మడిగెలు కొనుగోలుచేసి చిన్న, చిన్న వ్యాపారలు చేసుకుంటున్న ప్రజలపై ఆర్‌ఆర్‌ఆర్‌ పిడుగుపడటంతో తీవ్ర కలత చెందుతున్నారు. ఇదిలా ఉంటే తమకు న్యాయం చేయాలని బాధితులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 


మడిగెపోతే రోడ్డున పడతాం : భారతమ్మ, బాధితురాలు, చౌటుప్పల్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ జంక్షన్‌, సర్వీస్‌ రోడ్డుకోసం మామడిగెలను తొలగిస్తున్నారు. టీ అమ్ముకుంటూ మడిగెలు నిర్మించుకున్నాం. మడిగెపోతే మా కుటుంబం రోడ్డున పడుతుంది. అలైన్‌మెంట్‌ మార్చి, మాకు న్యాయం చేయాలి. 


Updated Date - 2022-09-29T05:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising