ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-10-17T06:06:29+05:30

పోడు భూములను సాగు చేసుకుం టున్న రైతులందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి, అక్టోబరు 16: పోడు భూములను సాగు చేసుకుం టున్న రైతులందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాల యంలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ద్వితీయ మహాసభలో ఆయన  మాట్లాడారు.ఆనాడు దొరలు, జమీందార్లు భూములను ఆక్రమించుకుంటే నేడు పాలకులు అదే తరహాలో పోడు భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం జెండాను  కంటు కోటయ్య ఎగురవేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు హుస్సేన్‌, పల్లె వెంకటరెడ్డి, భూక్య పాండునాయక్‌, జగన్మోహన్‌రెడ్డి, మాలోతు బాలునాయక్‌, రన్‌ మియా,  లింగయ్య, సైదులు, అంతమ్మ, అర్జు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

తెలంగాణ వ్యకాస మండల కమిటీ ఎన్నిక

ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(వ్యకాస) మండల కమిటీని  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కంటు కోటయ్య, ప్రధాన కార్య దర్శిగా భీల్యానాయక్‌తండాకు చెందిన ధరావత్‌ హరియానాయక్‌ ను ఎన్నుకునట్లు వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు తెలిపారు.



Updated Date - 2022-10-17T06:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising