ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జీలపై వెంటనే స్పందించాలి : అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-24T06:58:05+05:30

ప్రజల ఆర్జీలపై వెంటనే స్పం దించాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అ

అర్జిలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 23: ప్రజల ఆర్జీలపై వెంటనే స్పం దించాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ముఖ్యంగా వడదెబ్బ నివారణకు చర్యలు ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో వానాకాలంలో రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారని, దళారులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా మోసం చేయకుండా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటికి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారంలో జిల్లావ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచాలన్నారు. భూసమస్యలపై దరఖాస్తులు ఇచ్చే రైతు లకు ధరణి వెబ్‌సైట్‌లో భూమి స్థితిగతులను వివరించాలన్నారు. మొత్తం 31దరఖాస్తులు అందాయన్నారు. సమావేశంలో అధికారులు జ్యోతి పద్మ, సౌజన్య, అనసూర్య, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising