ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్రపు డెక్కను తొలగించి రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-10-17T06:02:35+05:30

చెరువు చుట్టుపక్కల పొలాల్లో విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క ఆకును తొలగించి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజనాయుడు కోరారు.

చిల్లేపల్లి పంట పొలాల్లో అల్లుకున్న గుర్రపు డెక్క ఆకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, అక్టోబరు 16: చెరువు చుట్టుపక్కల పొలాల్లో  విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క ఆకును తొలగించి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజనాయుడు కోరారు. ఆదివారం మండలంలోని చిల్లేపల్లి చెరువు చుట్టుపక్కల పొలాలను సీపీఐ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో  చెరువు చుట్టూ ఉన్న వందలాది ఎకరాల పంట పొలాల్లో  గుర్రపు డెక్క అల్లుకుందన్నారు. సదరు కాంట్రాక్టర్‌ నుంచి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. చిల్లేపల్లి, చింతకుంట్ల, బోడల్‌దిన్న గ్రామాల్లో  పొలాలను వ్యవసాయాధికారులు, తహసీల్దార్‌ పరిశీలించి గుర్రపు డెక్క ఆకుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు రావుల సత్యం, కత్తి శ్రీనివాసరెడ్డి, చిలకరాజు శ్రీను, లక్ష్మి ఉన్నారు. 





Updated Date - 2022-10-17T06:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising