ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-05-19T06:38:02+05:30

అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌, మే 18: అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదన్నారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57సంవత్సరాలు నిండిన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామన్న సీఎం కేసీఆర్‌ నేటికీ కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా మంజూరు చేయలేదన్నారు. ఏడు సంవత్సరాలుగా రేషన్‌ కార్డుల ఊసే లేదన్నారు. కనీసం మార్పుచేర్పులకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. డబుల్‌ బెడ్‌రూంల పంపిణీ లేద న్నారు. రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను కూడా పంపిణీ చేసే పరిస్థితి లేద న్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, కొండ అనురాధ, దైద జానకమ్మ, జిట్టా సరోజ, తుమ్మల పద్మజ, భూతం అరుణ, కారంపూడి ధనలక్ష్మీ, సుల్తానా ఉన్నారు. 

Updated Date - 2022-05-19T06:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising