ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీలగిరిలో శరవేగంగా అభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2022-05-01T06:44:04+05:30

నీలగిరి పట్టణంలో వం దల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిలోగా నీలగిరి ము ఖచిత్రం పూర్తిగా మారుతుందని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన సైదిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు 

మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి 

రామగిరి, ఏప్రిల్‌ 30: నీలగిరి పట్టణంలో వం దల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిలోగా నీలగిరి ము ఖచిత్రం పూర్తిగా మారుతుందని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు. శనివారం జరిగిన మునిసిపల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐ దు నెలలుగా పట్టణంలో రోడ్ల విస్తరణ, డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, రోడ్డుకు ఇరువైపులా డ్రైనే జీ కాల్వల నిర్మాణ పనులు, నేషనల్‌ హైవే రోడ్డు పనులు ఏకకాలంలో జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ రోడ్డులో మే 20వ తేదీలోగా పనులు పూర్తవుతాయన్నారు. రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతి వార్డుకు రూ.50లక్షలు కేటాయించాల ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. కేటీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదేవిధంగా తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని కోరారు. పా రిశుధ్య కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని క మిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఖ య్యూంబేగ్‌ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి రా కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యులు మాట్లాడుతుండగా చైర్మన కమిషనర్‌కు స మస్యలు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించడంతో కో ఆప్షన సభ్యులు జమాల్‌ఖాద్రి, సత్యనారాయణ, ఖ య్యూంబేగ్‌ల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. చైర్మన జోక్యంతో సద్దుమణిగింది. కౌన్సిలర్లు లేవనెత్తిన అంశాలపై మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి సమాధానమించ్చారు. అనంతరం ఎజెండా ను ఆమోదిస్తున్నట్లు చైర్మన సైదిరెడ్డి ప్రకటించారు. సమావేశంలో వైస్‌చైర్మన రమేష్‌, ఏసీపీ నాగిరెడ్డి, డీఈలు నర్సింహారెడ్డి, అశోక్‌, వెంకన్న, శానిటరీ ఇనస్పెక్టర్లు మూర్తూజాఅలీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-01T06:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising