ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోదాడ మునిసిపల్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణలో రభస

ABN, First Publish Date - 2022-08-16T06:36:32+05:30

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కోదాడ మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన జెండా పండుగ రసాభాసాగా మారింది.

విలేకరుల సమావేశంలో కన్నీరు పెట్టుకుంటున్న మునిసిపల్‌ చైర్మన్‌ శిరీష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగాలన్న కమిషనర్‌ 

కొందరి సలహా మేరకు జెండా ఆవిష్కరించిన  చైర్‌పర్సన్‌

కోదాడ టౌన్‌, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కోదాడ మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన జెండా పండుగ రసాభాసాగా మారింది. ఎమ్మెల్యే వ చ్చే వరకు జెండా ఆవిష్కరణ ఆపాలని కమిషనర్‌ మహేశ్వరరెడ్డి చెప్పడంతో గంభీర వాతావరణం నెలకొంది. మునిసిపల్‌ ప్రథమ పౌరురా లు ఉన్నారని, రాజ్యాంగం, సమయం ప్రకారం జెండా ఆవిష్కరించాలని ఎమ్మెల్యే వచ్చేవరకు ఆపే సంస్కృతి ఏమిటని కొందరు కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం జరుగుతుండగానే కొం తమంది సలహా మేరకు చైర్‌పర్సన్‌ వనపర్తి శీరిషలక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించా రు. విద్యార్థులు జాతీయగీతం ఆలపించడంతో కమిషనర్‌తోపాటు, హాజరైనా అందరూ జాతీయగీతం ఆలపించారు. దీంతో కార్య క్రమం ముగిసింది. జెండా పండుగ పూర్తికావడంతో ఎమ్యెల్యే మునిసిపల్‌ కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరుకాలేదు. 

గాంధీ విగ్రహం ఎదుట చైర్‌పర్సన్‌ శీరిష నిరసన దీక్ష

పట్టణంలోని గ్రంథాలయంలో జాతీయ నాయకుల చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ కొబ్బరికాయలు కొట్టి జాతీయ జెండాను అవిష్కరించారు. కాగా పట్టణ ప్రథమ పౌరురాలైన తనకు జాతీయజెండా పండుగలో కొబ్బరికాయ కొట్టాకుండా కొందరు అడ్డుపడి, ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానించారని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శీరిషలక్ష్మీనారాయణ గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేశారు. అనంతరం ఆమె విలేకులతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి పాల్పడుతున్న తనను అధికారిక, అనాధికారిక కార్యక్రమాల్లో రెండు సంవత్సరాలుగా కొందరు అవమానిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, మం త్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు. మహిళ ప్రజాప్రతినిధినైన తనకు అండగా ఉండాలన్నారు.

Updated Date - 2022-08-16T06:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising