ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ABN, First Publish Date - 2022-06-30T06:13:44+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపికైన మండలంలోని మొరిపిరాల ప్రాథమికోన్నత పాఠశాలను అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీతో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీచేశారు. ముందుగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు.

ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాలనలో విద్యార్థినితో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పమేలాసత్పథి


ఆత్మకూరు(ఎం), భు వనగిరి రూరల్‌, జూన్‌ 29: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపికైన మండలంలోని మొరిపిరాల ప్రాథమికోన్నత పాఠశాలను అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీతో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీచేశారు. ముందుగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో తరగతులవారీగా విద్యార్థులతో తెలుగు, ఆంగ్ల మాద్యమ పుస్తకాలను చదివించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో మంచి విద్యాబోదన లభిస్తుందనే విద్యార్థుల తల్లిదండ్రులకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ, జిల్లా మత్స్యశాఖ అధికా రి రాజారాం, తహసీల్దార్‌ ఎం.జయమ్మ, సర్పంచ్‌ ఎస్‌.తిర్మల్‌రెడ్డి, ఎంపీవో పద్మావతి, బి.లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం యాస పద్మారెడ్డి, కార్యదర్శి శేఖర్‌ పాల్గొన్నారు. అంతుకుముందు కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2021-22 కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా పీసీ మహలనోబిస్‌ జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.  

Updated Date - 2022-06-30T06:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising