ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలి

ABN, First Publish Date - 2022-10-04T05:38:51+05:30

రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాల్సిన ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఏఐకేఎంఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌ / కోదాడ టౌన్‌, అక్టోబరు 3 : రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాల్సిన ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ఖేరీ సంఘటన జరిగి ఏడాదైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి మాట్లాడారు. రైతుల మృతికి కారణమైన దోషులపై ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గంట నాగయ్య, బొడ్డు శంకర్‌, కునుకుంట్ల సైదులు, పోలెబోయిన కిరణ్‌, కారింగుల వెంకన్న, దేశోజు మధు, నర్సిరెడ్డి, అశోక్‌రెడ్డి, రవి, వీరయ్య, రామకృష్ణ, నజీర్‌, ఎల్లయ్య పాల్గొన్నారు. కోదాడ పట్టణంలోని రంగా థియేటర్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో దహనం చేశారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య, వక్కవంతుల నర్సింహారావు, మిర్యాల శ్రీను, సైదులు, ఉదయగిరి, వెంకన్న, జానయ్య, క్రాంతికుమార్‌, సైదులు, నగేష్‌, క్రాంతిక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T05:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising