ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులు లేకుండా చర్యలు

ABN, First Publish Date - 2022-07-07T05:54:26+05:30

పోలీ్‌సశాఖ చేపట్టిన 16 వర్టికల్స్‌ను పటిష్ఠంగా అమలయ్యేలా చూడాలని, జిల్లాలో పెండింగ్‌ కేసులు లేకుండా చూడాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రెమారాజేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ రెమారాజేశ్వరి 

నల్లగొండ టౌన్‌, జులై 6: పోలీ్‌సశాఖ చేపట్టిన 16 వర్టికల్స్‌ను పటిష్ఠంగా అమలయ్యేలా చూడాలని, జిల్లాలో పెండింగ్‌ కేసులు లేకుండా చూడాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరిస్తూ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పెండింగ్‌ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతోపాటు చాలా కాలంగా పెండింగ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. పోలీ్‌సశాఖ చేపట్టిన 16 ఫంక్షనల్‌ వర్టికల్స్‌ సమర్థంగా అమలుచేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రతిరోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ అశ్వక్‌, ఎస్‌బీ డీఎస్పీ రమేష్‌, డీసీఆర్బీ డీఎస్పీ మొగులయ్య, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలు నర్సింహారెడ్డి, వై.వెంకటేశ్వర్‌రావు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising