వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-08-04T05:33:24+05:30
వార్డుల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్రమేష్రెడ్డి అన్నారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 3: వార్డుల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్రమేష్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 26వవార్డులో పర్యటించి మాట్లాడారు. కమీషన్లకు కక్కుర్తిపడి యాదవుల శ్మశానవాటిక పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా మధ్యలోను ఆపడం దారుణమన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, కనీసం సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, నీటి సౌకర్యం లేదన్నారు. నాలాలు ఆక్రమణకు గురైనందున చిన్న వర్షానికే వరదనీరు ఇళ్లల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, షఫీవుల్లా, పోలగాని కృష్ణ, నామా ప్రవీణ్, కోడి కృష్ణ, స్వామినాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:33:24+05:30 IST