ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-08-11T06:29:48+05:30

గ్రామాలు, తండాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నా రు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలగిరి(సాగర్‌), ఆగస్టు 10: గ్రామాలు, తండాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నా రు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భగవాననాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య స మావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన మండలంలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధి కారులు కృషి చేయాలని సూచించారు. రెండు నెలల్లో మండలంలో అత్యధికంగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి సుమారు 2వేల మంది రైతులకు పెం డింగ్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాలను మంత్రి చేతులమీదుగా అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఉప ఎన్నిక హామీ మేరకు విడుదలైన నిధులతో అభివృద్ధి పను లు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చేపట్టిన అభివృద్ధి పనులు, పలు సమస్యలపై చర్చించారు. సమావేశానికి పలువురు సర్పంచులు, ఎంపీటీసీలకు బదులుగా వారి భర్తలు హాజరు కావడం, వివిధశాఖల సిబ్బంది గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఖాజా అజ్ఘర్‌అలీ, తహసీల్దార్‌ పాండునాయక్‌, వైస్‌ ఎంపీపీ దిలీ్‌పరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండ ల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పాపిరెడ్డి, రాంసింగ్‌నాయక్‌, బిచ్చానాయక్‌, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-11T06:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising