ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను సంరక్షించాలి : అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-20T05:54:11+05:30

హరితహారంలో నాటిన మొక్కలను వేసవిలో నీళ్లు పోసి సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

గోరెంట్లలోని ఎస్సారెస్పీ కాల్వల భూములను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిరాల, మే 19 : హరితహారంలో నాటిన మొక్కలను వేసవిలో నీళ్లు పోసి సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల గ్రామశివారులో ఎస్సారెస్పీ కాల్వల భూములను ఆయన పరిశీలించి, మాట్లాడారు. హరితహారం నాటికి మొక్కలు నాటేందుకు అధికారులు సంసిద్ధం కావాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని 3.25 లక్షల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల సంరక్షకులకు నెలకు రూ.6 వేల చొప్పున వేతనం అందజేస్తామన్నారు. ఆయన వెంట సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఎస్సారెస్పీ ఈఈ విజయ్‌కుమార్‌, డీఈ హరికృష్ణ, ఏఈ శ్రీకాంత్‌, తహసీల్దార్‌ అమీద్‌సింగ్‌, ఎంపీడీవో సరోజ, సర్వేయర్‌ రామనర్సయ్య, పంచాయతీ కార్యదర్శి మంగమ్మ, వీఆర్‌ఏలు పాల్వాయి వెంకన్న, రమేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T05:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising