ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు

ABN, First Publish Date - 2022-05-23T06:35:03+05:30

ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలని, ఆతర్వాత అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ తరువాత అభివృద్ధే లక్ష్యం

మంత్రి జగదీ్‌షరెడ్డి


సూర్యాపేటటౌన్‌, మే 22: ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలని, ఆతర్వాత అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పబ్లిక్‌క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సినిమా హాల్‌లకు వద్దు పబ్లిక్‌ క్లబ్‌కు వెళ్లి సేద తీరుదాం అనుకునేలా క్లబ్‌ను తీర్చిదిద్దుతామన్నారు. ప్రతీ ఒక్కరికి ఆహ్లాదకర వాతావరణం అందించేలా పబ్లిక్‌ క్లబ్‌ను రిక్రియేషన్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేలా నూతన కమిటీ కృషి చేయాలన్నారు. గత పాలకులు పబ్లిక్‌ క్లబ్‌ను పేకాట స్థావరాలుగా మార్చారని ఆరోపించారు. నూతన కార్యవర్గం చిత్తశుద్ధితో పాలన సాగించాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గంతో ఆర్డీవో రాజేంద్రకుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు పబ్లిక్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన నూతన ఎసీ జిమ్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపా ల్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి గణేష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పెండెం చంద్రశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌, బొనగిరి భాస్కర్‌, విశ్వబల, సునీల్‌రెడ్డి, అనంతరెడ్డి, వీరయ్య, సత్యనారాయణ, శ్రీను, జయశంకర్‌, తాహెర్‌పాషా, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T06:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising