ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడువులోగా పీఎంఈకేవైసీ పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-05-24T06:33:33+05:30

ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఈ నెల 31 నాటికి రైతులు తమ ప్రధానమంత్రి కిసాన్‌ సన్మాన్‌ యోజన(పీఎంఈకేవైసీ) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసా

కేతేపల్లిలో పీఎంఈకేవైసీ ప్రక్రియను పరిశీలిస్తున్న జేడీఏ సుచరిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత

కేతేపల్లి, మే 23: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఈ నెల 31 నాటికి రైతులు తమ ప్రధానమంత్రి కిసాన్‌ సన్మాన్‌ యోజన(పీఎంఈకేవైసీ) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత సూచించారు. కేతేపల్లిలోని మీ-సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న పీఎంఈకేవైసీ ప్రక్రియను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పీఎంకిసాన్‌ లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ ద్వారా తమ ఆధార్‌కార్డు, ఫోన్‌నెంబర్‌తో అనుసంధానం చేయించుకోవాలని కోరారు. పీఎంఈకేవైసీ చేయించని వారికి పీఎంకిసాన్‌ ఆర్థిక సాయం అందే అవకాశం లేదన్నారు. అనంతరం ఆమె స్థానికంగా ఉన్న ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో నిల్వలను పరిశీలించి, మాట్లాడుతూ వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయాలను తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట కేతేపల్లి వ్యవసాయ అధికారి పురుషోత్తం, ఏఈవోలు బాలరాజు, వీరేశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-24T06:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising