ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పల్లె ప్రగతి’తో పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం

ABN, First Publish Date - 2022-06-16T06:03:35+05:30

పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడడానికి పల్లె ప్రగతి ఎంతగానో తోడ్పడుతుందని పంచాయితీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కా

చెక్కును అందజేస్తున్న సందీ్‌పకుమార్‌ సుల్తానియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సుల్తానియా

ఆత్మకూర్‌(ఎస్‌), జూన్‌ 15 :పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడడానికి పల్లె ప్రగతి ఎంతగానో తోడ్పడుతుందని పంచాయితీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా అన్నారు. మండలంలోని ఏపూర్‌ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం పురోగతికి పల్లెలు ఆధారమని, అందుకోసమే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామపంచాయతీల్లో అంతర్భాగంగా తండాలు ఉండడంతో అభివృద్ధికి నోచుకోలేదని గ్రహించిన సీఎం తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం అంతేస్థాయిలో నిధులు కేటాయిస్తోందన్నారు. పల్లె ప్రగతిని అధికారులు, ప్రజాప్రతినిదులు, ప్రజలు ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, జడ్పీ సీఈవో సురేష్‌, డీపీవో యాదయ్య, డీఆర్‌డీవో పీడీ కిరణ్‌కుమార్‌, ఆర్డీవో రాజేంద్రప్రసాద్‌, ఎంపీపీ మర్ల స్వర్ణలతచంద్రారెడ్డి, సర్పంచ్‌ సానబోయిన రజితసుధాకర్‌, ఎంపీటీసీ దామిడి మంజులశ్రీనివాస్‌, తహసీల్దార్‌ హేమామాలిని, ఎంపీడీవో మన్సూర్‌నాయక్‌, ఎంపీవో సంజీవ, ఉమా, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-16T06:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising