ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి : కర్నె

ABN, First Publish Date - 2022-08-15T06:02:36+05:30

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అహంకారం కారణంగానే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందని, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ఆయ నకు మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్ధాన్‌ నారాయణపురం, ఆగస్టు 14: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అహంకారం కారణంగానే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందని, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ఆయ నకు మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ నాయకుల సమావేశంలో పాల్గొని అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొమ్మిది సంవత్సరాలుగా సీఎం కేసీఆర్‌ పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు. పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో ఎందుకు చేరుతున్నారో స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. దేశంలో పారిశ్రామిక వేత్తలు ఆదానీ, అంబానీలను ప్రధాని మోదీ పెంచి పోషిస్తున్నారని, అందులో భాగంగానే కాంట్రాక్టర్‌ అయినా రాజగోపాల్‌రెడ్డి లాంటి వాళ్లు సైతం బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుత్త ఉమాదేవి ప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతివెంకటేశంగౌడ్‌, సర్పంచులు సికీలమెట్ల శ్రీహరి, సుర్వి యాదయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ జక్కిడి జంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, బొంగు జంగయ్య, దుబ్బాక శశిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T06:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising