ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడుగు బలహీన వర్గాల పెన్నిధి ఎన్టీఆర్‌

ABN, First Publish Date - 2022-01-19T06:43:17+05:30

ఎన్టీఆర్‌ వర్ధంతి సంద ర్భంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆయన విగ్రహాలకు, చిత్ర పటాలకు టీడీపీ నాయకులు నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలను పలువురు కొనియడారు.

నేరేడుచర్లలో ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జనవరి 18:  ఎన్టీఆర్‌ వర్ధంతి సంద ర్భంగా  జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆయన విగ్రహాలకు,  చిత్ర పటాలకు టీడీపీ నాయకులు నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలను పలువురు కొనియడారు.  బలహీన వర్గాల పెన్నిధి ఎన్టీఆర్‌ ఆని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పందిరి శోభన్‌బాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పెదపోలు వీరయ్యగౌడ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అఽధ్యక్షుడు బొల్లికొండ సైదులు అన్నారు. చివ్వెంల మండలంలోని గుంజలూరు గ్రామంలో ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఐతరాజు రాంమళ్లు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. 

నేరేడుచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పట్టణ అధ్యక్షుడు పాల్వాయి రమేష్‌ ఆధ్వర్యంలో  పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 సూర్యాపేట టౌన్‌: ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో నిలిచిన చిర స్మరణీయుడని   టీడీపీ జిల్లా నాయకులు నాతాలరాంరెడ్డి, దారోజు జానకిరాములు అన్నారు. ఎన్‌టీఆర్‌ వర్ధంతి సందర్భంగా సూర్యా పేటలోని ఎన్టీఆర్‌ గార్డెన్‌లో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారు మాట్లాడారు.

 హుజూర్‌నగర్‌ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఏసీఎస్‌ఛైర్మన్‌ కట్టా గోపాల్‌రావు, యలమంచిలి శ్రీనివాస్‌చౌదరి, టీడీపీ రాష్ట్రకార్యదర్శిలు పారుపల్లి సురేష్‌ చౌదరి, నలమాద శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.

చిలుకూరులో టీడీపీ మండల అధ్యక్షుడు సాతులూరి గురవయ్య, కోదాడలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి ప్రభాకర్‌ ఎన్టీఆర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. కోదాడతో కమ్మ సేవా సమితి నాయకులు  పేదలకు దుస్తులను అందజేశారు.

 అనంతగిరిలో ఉప్పగండ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. గింజుపల్లి జగన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వ హించారు.

 గరిడేపల్లి, మోతె, మఠంపల్లి మండలాల్లో ఎన్టీఆర్‌ చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు.   


Updated Date - 2022-01-19T06:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising