ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2022-12-16T01:25:12+05:30

జిల్లాలోని పోలీ్‌సస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ను పెంపొందించి కేసుల దర్యాప్తును పూర్తి చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణను త్వరగా పూర్తిచేసి చార్జీషీట్‌ దాఖలు చేయాలన్నారు. నమోదు చేసే కేసుల్లో ఎక్కువ శాతం కోర్టుల్లో శిక్షల శాతం పెరిగేలా చూడాలన్నారు.

ప్రతిభ కనబరిచిన పోలీసులతో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, పక్కన డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటక్రైం, డిసెంబరు 15: జిల్లాలోని పోలీ్‌సస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ను పెంపొందించి కేసుల దర్యాప్తును పూర్తి చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణను త్వరగా పూర్తిచేసి చార్జీషీట్‌ దాఖలు చేయాలన్నారు. నమోదు చేసే కేసుల్లో ఎక్కువ శాతం కోర్టుల్లో శిక్షల శాతం పెరిగేలా చూడాలన్నారు. రౌడీలు, ఇతర నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ప్రతీ కేసుకు సంబంధించి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఉండాలని, లక్ష్యం నిర్దేశించుకుని విధులు నిర్వహించాలన్నారు. చోరీ కేసుల్లో అన్ని కోణాల్లో విచారణ చేసి చోరీలకు పాల్పడిన వారిని గుర్తించి సొత్తును రాబట్టాలన్నారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రంవేళల్లో వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సీసీకెమెరాలను ప్రతి రోజు మానిటరింగ్‌ చేయాలని ఎక్కడైనా కెమెరాలు పని చేయకపోతే వెంటనే సరి చేయించాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌ వర్టికల్‌ పని విభాగాలను సమర్ధంగా నిర్వహించాలన్నారు. డయల్‌ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేశారు. సమావేశంలో డీఎస్పీలు పరిక నాగభూషణం, జి.వెంకటేశ్వర్‌ రెడ్డి, సీఐలు సోమనారాయణసింగ్‌, తుల శ్రీనివాస్‌, జి.రాజశేఖర్‌, రాజేష్‌, శివశంకర్‌, రామలింగారెడ్డి, పీఎన్‌డీప్రసాద్‌, ఆంజనేయులు, నాగార్జున, నర్సింహ, ఆర్‌ఐలు శ్రీనివాసరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising