ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలి

ABN, First Publish Date - 2022-09-11T05:37:27+05:30

యువత చెడు అలవాట్ల కు బానిస కాకుండా సన్మార్గం లో నడిచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అశోక్‌తేజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ

గుండాల, సెప్టెంబరు 10: యువత చెడు అలవాట్ల కు బానిస కాకుండా సన్మార్గం లో నడిచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రా మంలో శనివారం నిర్వహించిన ‘అమ్మయాది’ పెండెం ఫౌండేషన్‌ సంస్థ 11వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ట్యూనుకు అనుకూలంగా అక్షరాలు అమర్చడం తనకు నూ నూగు మీసాలు వచ్చినప్పుడే నేర్చుకున్నానన్నారు. తాను పుట్టకముందు నుంచే తన ఇం ట్లో పాట పుట్టిందన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలోని కొమ్మా ఉయ్యాల, కొమురం భీమూ డో పాటలు ప్రపంచాన్ని ఆకర్షించాయన్నారు. అనంతరం కాళోజీ పురస్కార గ్రహీత, రచన సాహితీ కళా వేదిక అధ్యక్షుడు రామోజు హరగోపాల్‌కు ‘అమ్మయాది’ జీవన సాఫల్య పురస్కారం అందజేసి సన్మానించారు. అనంతరం సాహితీవేత్తలు గణేష్‌, రంగయ్యను సత్కరించారు. కార్యక్రమంలో ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.ఖలీల్‌, సర్పంచ్‌ బండారు సంధ్యాశ్రీనివాస్‌, ఎంపీటీసీ పాయిలి కవితాశ్రీనివాస్‌, అమ్మయాది సలహాదారులు ఎస్‌ఎన్‌ చారి, రచ్చ భారతి, మేడ రాజు, ముత్యం రాములు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-11T05:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising