ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపట్నుంచి 15 వరకు జిల్లాలో పాదయాత్రలు

ABN, First Publish Date - 2022-08-08T05:47:48+05:30

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలతో ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకు పాదయాత్రలు నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న అనీల్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, ఆగస్టు 7: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలతో ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకు పాదయాత్రలు నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం భువనగిరిలో బోనాల వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వారం రోజులపాటు 75 మందితో కూడిన కాంగ్రెస్‌ బృందం త్రివర్ణపతాకాలతో 75 కిలోమీటర్లపాటు పాదయాత్ర చేస్తుందన్నారు. జిల్లాలోని ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, స్వాతంత్య్రం కోసం  పోరాడిన మహత్మాగాంధీ, బాలగంగాధర తిలక్‌, మోతీలాల్‌ నెహ్రూ, సర్దార్‌పటేల్‌ తదితర యోధుల గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాదయాత్రల్లో పాల్గొనాలన్నారు. స్వాతంత్య్రం లభించాక తొలి ప్రధానిగా పండిత్‌ నెహ్రూ అందించిన అభివృద్ధి పాలన, అమల్లోకి తెచ్చిన సంస్కరణలను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. ఆయనవెంట కాంగ్రెస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌, కె సోమయ్య, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-08-08T05:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising