ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవయవ దానం పవిత్ర కార్యం : మంత్రి హరీష్‌రావు

ABN, First Publish Date - 2022-11-28T00:10:09+05:30

అవయవదానం పవిత్ర కార్యమని ఆర్థికశాఖ మంత్రి టీ. హరీష్‌రావు అన్నారు.

అవయవ దాతల కుటుంబసభ్యులను సన్మానిస్తున్న మంత్రి హరీష్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌/ మోత్కూరు, నవంబరు 27: అవయవదానం పవిత్ర కార్యమని ఆర్థికశాఖ మంత్రి టీ. హరీష్‌రావు అన్నారు. భువనగిరి పట్టణానికి చెందిన మెతుకు సతీష్‌ 25 అక్టోబరు 2021న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భర్త మృతదేహం నుంచి అవయవదానానికి భార్య కళ్యాణి అంగీకరించడంతో సేకరించిన అవయవాలను బాధితులకు అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సతీష్‌ కుటుంబాన్ని మంత్రి హరీష్‌రావు అభినందించి జీవన్‌దాన్‌ ప్రశంసా పత్రం అందజేశారు. కా ర్యక్రమంలో సతీష్‌ కుటుంబసభ్యులు సరస్వతి, కిరణ్‌, సౌమ్య, వైష్ణవి పాల్గొన్నారు. గత ఏడాది మోత్కూరు మండలకేంద్రానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి బ్రెయిన్‌ డెడ్‌ కాగా గుండె, లివర్‌ తదితర అవయవాలు దానం చేశారు. ఆయన భార్య వరకాంతం నిర్మలను మంత్రి హారీష్‌రావు శాలువతో సన్మానించి, ప్రశంసా పత్రం అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ సామ పద్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising