ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరముత్యాలమ్మకు వైభవంగా బోనాలు

ABN, First Publish Date - 2022-08-08T05:43:44+05:30

జిల్లాకేంద్రంలోని శ్రీకృష్ణా టాకీస్‌ ప్రాంతంలోని ఊర ముత్యాలమ్మతల్లికి బోనాల పండుగను ఆదివారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి, పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఊరముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి జగదీ్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొక్కులు చెల్లించుకున్న భక్తులు

వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి


సూర్యాపేట కల్చరల్‌, ఆగస్టు 7: జిల్లాకేంద్రంలోని శ్రీకృష్ణా టాకీస్‌ ప్రాంతంలోని ఊర ముత్యాలమ్మతల్లికి బోనాల పండుగను ఆదివారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి, పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు జీవాలను బలిచ్చి మొక్కు చెల్లించుకున్నారు. మహిళలు చీరెలు, గాజులను అమ్మవారికి సమర్పించారు. దేవాలయంలో నాగులమ్మ పుట్ట దగ్గర పసుపు, కుంకుమ చల్లి మహిళలు పూజల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు సాయంత్రం పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొని ఊరేగింపుగా డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు సారగండ్ల రాములు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 


సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు : మంత్రి జగదీ్‌షరెడ్డి 

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఊర ముత్యాలమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేకపూజల్లో పాల్గొని మాట్లాడారు. గత పాలకుల హయాంలో నిరాధారణకు గురైన దేవాలయాలను సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కౌన్సిలర్‌ ఆకుల కవితలవకుశ, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మొరిశెట్టి శ్రీనివాస్‌, మారిపెద్ది శ్రీనివా్‌సగౌడ్‌, వల్ధాస్‌ సంధ్యజాని పాల్గొన్నారు. 


సంప్రదాయాలను కాపాడుకోవాలి : రాంరెడ్డిదామోదర్‌రెడ్డి, పటేల్‌ రమే్‌షరెడ్డి 

సంస్కతీ సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతీఒక్కరి బాధ్యతని మాజీమంత్రి రాం రెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఊరముత్యాలమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఊర ముత్యాలమ్మతల్లి దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఉం డాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, యాట వెంకన్న, బైరు శైలేందర్‌గౌడ్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, చెంచల శ్రీనివాస్‌, కోతి గోపాల్‌రెడ్డి, గోదాల రంగారెడ్డి, వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు. 


ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి : సంకినేని 

ఊర ముత్యాలమ్మతల్లి దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఊర ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మాట్లాడారు. కార్యక్రమంలో గజ్జెల వెంకట్‌రెడ్డి, సలిగంటి వీరేంద్ర, పల్స మల్సూర్‌గౌడ్‌, వెన్న శశిథర్‌రెడ్డి, వల్ధాస్‌ ఉపేందర్‌, శేఖర్‌, సైదులు, వెంకన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising