ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊ అంటావా... ఉఊ అంటావా..

ABN, First Publish Date - 2022-02-24T06:09:40+05:30

నల్లగొండ జిల్లా కేంద్రంలో సినీ నటి సమంత సందడి చేశారు. మాంగళ్య షాపింగ్‌ మాల్‌లోని కౌంటర్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు. అంతకుముందు మాంగళ్య 12వ షోరూంను విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభించారు.

నల్లగొండలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న సినీనటి సమంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత సందడి


నల్లగొండ అర్బన్‌, ఫిబ్రవరి 23: నల్లగొండ జిల్లా కేంద్రంలో సినీ నటి సమంత సందడి చేశారు. మాంగళ్య షాపింగ్‌ మాల్‌లోని కౌంటర్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు. అంతకుముందు మాంగళ్య 12వ షోరూంను విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్లు కాసం శివప్రసాద్‌, పుల్లూరు అరుణ్‌ పాల్గొన్నారు. కాగా, నటి సమంతను చూసేందుకు యువకులు, అభిమానులు ఉదయం 10గంటలకే జిల్లా కేంద్రం హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని షాపింగ్‌ మాల్‌ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. సమంత మధ్యా హ్నం 12.30గంటలకు షాపింగ్‌ మాల్‌ వద్దకు చేరుకున్నారు. ఆమె కారుదిగి స్టేజీ ఎక్కగానే అభిమానులు కేరింతలు కొట్టారు. అభిమానుల కేరింతలు చూసిన నటి సమంత ‘ఊ అంటావా.. ఉఊ అంటావా’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. అభిమానుల కేరింతలు చూసి స్టేజీ నుంచే ఆమె ఫ్లయింగ్‌ కిస్‌లు ఇచ్చారు. దీంతో అభిమానులు మరింత ఫిదా అయ్యారు. రోడ్డుకు ఇరువైపులా అభిమానులు కిక్కిరిసిపోవడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఎన్జీ కళాశాల నుంచి రామగిరి వైపు, శివాజీనగర్‌ వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు.





Updated Date - 2022-02-24T06:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising