ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మూసీ’ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN, First Publish Date - 2022-06-30T06:41:41+05:30

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46టీఎంసీ) కాగా, గరిష్ట స్థాయికి చేరడంతో ఐదు క్రస్ట్‌గేట్లను ఎత్తి రెండు రోజులుగా నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేతేపల్లి/చింతలపాలెం/ నాగార్జునసాగర్‌, జూన్‌ 29: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46టీఎంసీ) కాగా, గరిష్ట స్థాయికి చేరడంతో ఐదు క్రస్ట్‌గేట్లను ఎత్తి రెండు రోజులుగా నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలో హెచ్చుతగ్గులు ఉండటంతో పాటు ప్రాజెక్టు నిర్మించిన నాడు నిర్దేశించిన గేట్ల నిర్వహణ షెడ్యూల్‌ మేరకు జూన్‌ నెలలో 638 అడుగుల మేర మాత్రమే నీరు నిల్వ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అదనపు నీటిమట్టాన్ని క్రస్టుగేట్ల ద్వారా దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి 1,339 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో, ప్రాజెక్టు 3, 4, 7, 8, 10 నెంబర్‌ క్రస్టుగేట్లను అడుగున్నర మేర ఎత్తిన అధికారులు 4,478 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. దీంతో బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 640.60 అడుగులుగా (3.40టీఎంసీ) నమోదైంది.


‘పులిచింతల’కు స్వల్పంగా పెరిగిన  వరద

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు బుధవారం ఎగువ నుంచి 3,751 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పవర్‌ హౌస్‌లోని ఒక యూనిట్‌ ద్వారా 1,500  క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ గంటకు 15మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు(45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 163.74అడుగులుగా (30.04టీఎంసీలు) నమోదైంది.


532.40 అడుగుల వద్ద సాగర్‌ నీటి మట్టం

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి నీటి విడుదల లేకపోయినా, 7,218 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు  (312.0450 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 532.40 అడుగులు (172.8700 టీఎంసీలు)గా ఉంది.  సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 6,218 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా వెయ్యి క్యూసెక్కులు మొత్తం 7,218 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.  

Updated Date - 2022-06-30T06:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising