ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

578.10 అడుగులుగా సాగర్‌ నీటి మట్టం

ABN, First Publish Date - 2022-01-10T05:08:59+05:30

నాగార్జునసాగర్‌ ప్రాజె క్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 578.10 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 578.10అడుగులు(277.5334టీఎంసీలు)గా ఉంది.

578.10 అడుగుల వద్ద సాగర్‌ నీటి మట్టం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌, జనవరి9: నాగార్జునసాగర్‌ ప్రాజె క్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 578.10 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 578.10అడుగులు(277.5334టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8755 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 4287 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1800 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 8400 క్యూసెక్కుల నీటిని  విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 23242 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి ఎలాంటి నీటిరాక లేదు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 856.80.అడుగులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి ఎటువంటి నీటి రాక లేదు.


సాగర్‌లో పర్యాటకుల సందడి

సంక్రాంతి సెలవులు కావడంతో ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్‌ అందాలను తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. దీంతో సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధవనం, ఎత్తిపోతల, కొత్త వంతెన తదితర ప్రాంతాల వద్ద పర్యాటకులు సందడి నెలకొంది. హిల్‌కాలనీ డౌన్‌ పార్కు వద్ద ఉన్న లాంచీ స్టేషన్‌ నుంచి పర్యాటకశాఖ జలాశయంలో నాలుగు జాలీ ట్రిప్పులు లాంచీలు నడిపినట్లు లాంచీస్టేషన్‌ అధికారులు   తెలిపారు.

Updated Date - 2022-01-10T05:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising