ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్ల కోసం కాదు.. భరోసా ఇచ్చేందుకు వచ్చా

ABN, First Publish Date - 2022-05-29T06:14:10+05:30

ఓట్లు అడిగేందుకు రాలేదని, ప్రజల బాగోగులు తెలుసుకొని అండగా ఉన్నానని భరోసా కల్పించేందుకు వచ్చానని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

మట్టపల్లిలో రచ్చబండలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మఠంపల్లి, మే 28: ఓట్లు అడిగేందుకు రాలేదని, ప్రజల బాగోగులు తెలుసుకొని అండగా ఉన్నానని భరోసా కల్పించేందుకు వచ్చానని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని మట్టపల్లి, రామచంద్రాపురం, భీమ్లాతండా, గుర్రంబోడుతండా, కృష్ణతండా, సుల్తాన్‌పురంతండాల్లో శనివారం నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎటూ చూసినా ఎమ్మెల్యే సైదిరెడ్డి భూఆక్రమణాలే కనిపిస్తున్నాయన్నారు. పెదవీడు రెవెన్యూ పరిధిలో ఉన్న 540సర్వే నంబర్‌లో ఎన్‌సీఎల్‌కు చెందిన 107 ఎకరాలు, ఇదే సర్వే నంబర్‌లో ఎంజీ పవర్‌ ప్లాంటుకు చెందిన 120ఎకరాలు,పెదవీడు సమీపంలో మరో 46 ఎకరాలు ఆక్రమించుకున్నాడ ని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌, వైన్స్‌తో పాటు చేపల వేట, గంజా యి, గుట్కా,రేషన్‌ దందా చేసుకుంటూ నియోజకవర్గాన్ని మాఫీయాగా మార్చరని విమర్శించారు. వ చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, రూ.2లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు,రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు, పంట బీమాతోపాటు మద్దతు ధర కల్పిస్తామన్నారు. అంతకు ముందుకు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాములశివారెడ్డి, భూక్య మంజూనాయక్‌, ఎంపీ పీ గోపాల్‌నాయక్‌, ఽనవీన్‌నాయక్‌, జైపాల్‌రెడ్డి, మాలోతు భీముడునాయక్‌, రామిశెట్టి అప్పారావు, సయ్యద్‌ కరీం, పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు రామచంద్రయ్య, బాబునాయక్‌ పాల్గొన్నారు.


సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలి 

హుజూర్‌నగర్‌: సర్పంచ్‌ల హక్కులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి కాంగ్రెస్‌ సర్పంచ్‌లు, పార్టీ నాయకులతో శనివారం నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. పెండింగ్‌ బకాయిల కోసం సర్పంచ్‌లు చేసే ఆందోళనకు కాంగ్రెస్‌ సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-05-29T06:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising