ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్వాసన కాదు.. సువాసన నింపండి

ABN, First Publish Date - 2022-12-07T23:37:18+05:30

తమ పరిసరాల చుట్టూ ఉన్న చెత్తా చెదారం, దుర్గంధాన్ని చూసి చలించిపోయాడు ఓ

మఠంపల్లిలోని దుకాణదారులకు గులాబీ పూలు అందజేస్తున్న సామాజిక కార్యకర్త గూడ నర్సింహారావు, ఆయన కుమార్తె సౌమ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుకాణదారులకు గులాబీ పూలు అందజేస్తూ విజ్ఞప్తి

తండ్రికి తోడుగా కుమార్తె ప్రచారం

మఠంపల్లి, డిసెంబరు 7 : తమ పరిసరాల చుట్టూ ఉన్న చెత్తా చెదారం, దుర్గంధాన్ని చూసి చలించిపోయాడు ఓ సామాజిక కార్యకర్త. ‘దుర్వాసన కాదు.. సువాసన నింపండి’ అంటూ దుకాణదారుల మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన టైలర్‌ గూడ నర్సింహారావు, డిగ్రీ చదువుతున్న కుమార్తె సౌమ్య దుకాణదారులకు గులాబీ పూలు అందజేస్తూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. గాంధీ జయంతి, అంబేడ్కర్‌ వర్ధంతి, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం వంటి ముఖ్యమైన రోజుల్లో తండ్రీకుమార్తెలిద్దరూ ఇలా గులాబీ పూలు పంపిణీ చేస్తున్నారు. మఠంపల్లిలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు, దుకాణదారులకు ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా వారిలో మార్పు రాలేదు. మఠంపల్లి ప్రధాన రహదారితో పాటు పెదవీడు, జానపహాడ్‌, అల్లీపురం, రఘునాథపాలెం గ్రామాలకు వెళ్లాంటే ప్రయాణికులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. దుకాణదారులు చికెన వ్యర్థాలు, కొబ్బరిబొండాల చిప్పలు, పాలిథిన కవర్లను రహదారుల పక్కన పడేస్తుండటంతో అవి కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రజలు, ప్రయాణికులు ఆ రహదారుల వెంట వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన గూడ నర్సింహారావు, తన కుమార్తె సౌమ్యతో కలిసి రోడ్ల పక్కన వ్యర్థాలు వేస్తున్న దుకాణదారులకు గులాబీ పూలు ఇచ్చి మరోసారి ఇలా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మంగళవారం 100మంది దుకాణదారులకు గులాబీ పూలు ఇచ్చి పరిసరాల స్వచ్ఛత పాటించాలని కోరారు. తండ్రీకుమార్తెల ప్రయత్నంతోనైనా రహదారుల పక్కన వ్యర్థాలు పడేసే దుకాణదారుల్లో మార్పు వస్తుందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-12-07T23:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising