పార్కింగ్ స్థలం కాదు.. మార్కెట్ యార్డు
ABN, First Publish Date - 2022-10-17T06:12:37+05:30
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారింది.
గాలి వాల్యూమ్ షెడ్ ప్రారంభం కాకముందే దుర్వినియోగం
రాత్రి వేళల్లో మద్యంప్రియుల తిష్ఠ
సూర్యాపేట మార్కెట్ యార్డు ఆవరణలో నిత్యం ఇదే తంతు
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారింది. మార్కెట్‌కు సంబంధం లేనివారికి చెందిన డీసీఎంలు, లారీలను ఇంకా ప్రారంభించని గాలి వాల్యూమ్ షెడ్లో పార్కింగ్ చేస్తున్నారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ప్రైవేటు వాహనాల యజ మానులతో మార్కెట్ కు చెందిన ఓ ఉద్యోగి చనువుగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. రోజుకు 10 నుంచి 15 డీసీఎం వాహనాలు, లారీలను మార్కెట్ యార్డులో పార్కింగ్ చేస్తున్నారు.
సూర్యాపేట సిటీవ్యాపారుల(ఖరీదుదారుల)వాహనాలే ఎక్కువ
వ్యవసాయ మార్కెట్లో పార్కింగ్ చేస్తున్న వాహనాల్లో చాలావరకు మార్కెట్లోని వ్యాపారులు(ఖరీదుదారులు)లకు చెందినవే ఉంటున్నాయి. తాము మా ర్కెట్లో వ్యాపారం చేస్తున్నామని, తద్వారా మార్కెట్‌కు ఆదాయం వస్తోందని, మార్కెట్లో వాహనాలను పార్కింగ్ చేస్తే మీకు ఏం నష్టం వస్తుందని ఓ వ్యాపారి మా ర్కెట్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగిపై గతంలో దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఆ సమయంలో మార్కెట్ అధికారులు సదరు వ్యాపారికే మద్దతుగా నిలబడినట్లు తెలిసింది. సాధారణంగా ఒక డీసీఎంను ప్రైవేటుగా పార్కింగ్ చేస్తే రోజుకు రూ.150 నుంచి రూ.300వరకు చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్ వ్యా పారులు,వీరికి పరిచయం ఉన్న మరో నలుగురు ప్రైవే టు వ్యక్తులు తమ వాహనాలను మార్కెట్ యార్డులోని గాలి వాల్యూమ్ షెడ్లో పార్కింగ్ చేస్తున్నారు.
రాత్రి వేళల్లో మద్యంప్రియులకు అడ్డాగా..
చీకటి పడితే చాలు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ మద్యం బాబులకు అడ్డాగా మారింది. వ్య వసాయ మార్కెట్లోకి పోలీసులు రాత్రి వేళల్లో రారు అన్న ధీమాతో మద్యంప్రియులు తిష్ఠ వేస్తున్నారు. మార్కెట్ యార్డులు, కమీషన్‌దారుల షాపుల ఎదుట, పశువుల సంత వంటి నిర్మాన్యుష ప్రాంతాలను మద్యం బాబులు తమ అడ్డాగా ఎంచుకుంటున్నారు. మార్కెట్ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం, మార్కెట్ సెక్యూరిటీ గార్డులు విధులను సక్రమంగా నిర్వర్తించకపోడం మద్యం బాబులకు వరంగా మారింది. దీంతో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రతీ రోజు ఉదయం ఖాళీ మందు సీసాలు దర్శనమిస్తున్నాయి. సుందరయ్యనగర్ వైపు ఉన్న రెండో గేటును రాత్రి సమయంలో కూడా తెరచి ఉంచటంతో జాతీయ రహదారి సమీపంలో వైన్స్ దుకాణంలో కొనుగోలు చేసిన మద్యంప్రియులు నేరుగా రెండో గేటు నుంచి మార్కెట్ కార్యాలయ ఆవరణలోకి వచ్చి మద్యం తాగుతున్నారు.
మార్కెట్లో సెక్యూరిటీని పెంచుతాం
సూర్యాపేట మార్కెట్ యార్డుల్లో సెక్యూరిటీని పెంచి ఆసాంఘిక కార్య క్రమాలు జరగకుండా, అనుమానితు లు లోపలికి రాకుండా చర్యలు తీసుకుం టాం. మార్కెట్ యార్డులో వాహనాలను పార్కింగ్ చేయొద్దని వాహ నదారులకు ఇప్పటికే పలుమార్లు చెప్పాం. మార్కెట్లో కార్యకలాపాలు జరగుతున్న సమ యంలోనే ఖరీదు దారుల వాహనాలను అనుమతిస్తాం. ఇతర వేళల్లో గేటు కు తాళం వేసి వాహనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటాం.
– ఎండీ ఫసియోద్దీన్, మార్కెట్ కార్యదర్శి, సూర్యాపేట
Updated Date - 2022-10-17T06:12:37+05:30 IST