ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రహణాల కారణంగా నోములు, వ్రతాలు వద్దు

ABN, First Publish Date - 2022-10-12T06:46:59+05:30

ఈ సంవత్సరం దీపావళి రోజు 25వ తేదీ ఆశ్వీయుజ మాస అమావాస్య రోజు సూర్యగ్రహణం, నవంబరు 8వ తేదీ కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్నందున ఈ ఏడాది దీపావళి నోములు, కేదారేశ్వర వ్రతాలు నిర్వహించుకోకూడదని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ప్రకటించింది.

హాలియా రామాలయంలో సమావేశమైన బ్రాహ్మణ పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలియా, అక్టోబరు 11 : ఈ సంవత్సరం దీపావళి రోజు 25వ తేదీ ఆశ్వీయుజ మాస అమావాస్య రోజు సూర్యగ్రహణం, నవంబరు 8వ తేదీ కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్నందున ఈ ఏడాది దీపావళి నోములు, కేదారేశ్వర వ్రతాలు నిర్వహించుకోకూడదని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ప్రకటించింది. మంగళవారం హాలియాలోని రామాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు గోవర్థన రాఘవాచార్యులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బ్రాహ్మణ పెద్దలు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాంతీయ ఆచారాల ప్రకారం దీపావళి నోము అమావాస్య రోజు చేస్తారని  అది కుదరని వారు కార్తీకపౌర్ణమి రోజు చేసుకుంటారని అన్నారు. ప్రస్తుతం అమావాస్య, కార్తీక పౌర్ణమి రోజుల్లో గ్రహణాలు ఉన్నందున వ్రతాలు, నోములు ఆచరించడం తగదని నిర్ణయించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాముడు రాంమూర్తి, గౌరవ అధ్యక్షుడు మురళీకృష్ణశర్మ, రమణశర్మ, శ్రీనివాసశర్మ, శివాజీశర్మ, సంఘ పెద్దలు ఆదిత్య శర్మ, అనంతశర్మ, రాజశేఖర్‌శర్మ, వినోద్‌శర్మ, విజయ్‌శర్మ, అనంతరామశర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T06:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising