ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిడమనూరు, నర్సింహులగూడెం జల దిగ్బంధంలోనే

ABN, First Publish Date - 2022-09-09T06:43:40+05:30

మండలంలోని ముప్పారం, వేంపాడు గ్రామాల నడుమ 32.109కి.మీ వద్ద నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు బుధవారం సాయంత్రం గండి పడగా, నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

వరద తాకిడికి కొట్టుకుపోయిన జాతీయ రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌ ఎడమ కాల్వ గండికి మరమ్మతులు ప్రారంభం

నిడమనూరు, సెప్టెంబరు 8: మండలంలోని ముప్పారం, వేంపాడు గ్రామాల నడుమ 32.109కి.మీ వద్ద నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు బుధవారం సాయంత్రం గండి పడగా, నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గండి పూడ్చివేత పనులను ఎన్నెస్పీ అధికారులు గురువారం సాయంత్రం ప్రారంభించి యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. చెరువు తెగినా, కాల్వకట్ట తెగినా, భారీ వర్షాలు కురిసినా నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. లోతట్టు ప్రాంతా లు కావడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సాగర్‌ కాల్వకు గండి పడటం తో నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రెండు రోజులుగా రెండు గ్రామాల ప్రజలు వరద నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరి బియ్యం, దుస్తులు సహా సామగ్రి వరద పాలైంది. వరదతో పాటు కరెంటు కూడా లేకపోవడంతో చీకట్లోనే ప్రజలు బిక్కుబిక్కుమం టూ గడిపారు. వరద నీరు ముంచెత్తుతుందన్న భయంతో అనేకమంది తమ ఇళ్లకు తాళాలు వేసి వేరేచోటకు వెళ్లారు. తరచూ రెండు గ్రామా ల ప్రజలు ముంపునకు గురవుతున్నారు. దీంతో ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. మొద టి నుంచి ఈ రెండు గ్రామాలకు జలగండం ప్రమాదంగా మారింది. రెండు గ్రామాల్లో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు. పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, 2013లో నిడమనూరు చెరువు తెగడంతో రెండు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాగా, పలువురు నిరాశ్రయులయ్యారు. నాటి ఘటనలో అనేక మంది నష్టపోవడంతో పాటు వారం రోజుల వరకు వరదతోనే గడిపారు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా సాగర్‌ ఎడమ కాల్వకు గండి పడటంతో రెండు గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 500 ఎకరాలకు పైగా పొలాలు నీట మునగడమే కాకుండా లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరింది. నర్సింహులగూడెం వద్ద జాతీయ రహదారిపై ఆరు అడుగుల ఎత్తులో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు జలమయం కావడంతో రాకపోకలు నిలిపివేసి వాహనాలను దారి మళ్లించారు. నిడమనూరులోని లోత ట్టు ప్రాంతమైన సాయినగర్‌ వీధిలో సుమారు 50 ఇళ్లలోకి వరద చేరింది. వరదతో ఇంట్లోని అన్ని వస్తువులు తడిసి పనికి రాకుండా పోయాయి. వరద తగ్గడంతో మరుసటి రోజు ఆ వీధి అంతా బురదమయంగా మారింది. బురదను ఎత్తిపోసి ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. రోడ్డు వెం ట ఉన్న పెట్రోలు బంక్‌, స్టేట్‌ బ్యాంకు, మినీ గురుకులంతో పాటు పలు దుకాణాలు, ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసులు మంచాల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సు రక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి మినీ గురుకులంలోని 87మంది బాలికలను సురక్షత ప్రాంతానికి తరలించకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.


‘గండి’తో పూడ్చలేని నష్టం

సాగర్‌ ఎడమ కాల్వకు గండి పడటంతో నర్సింహులగూడెం నుంచి నిడమనూరు వరకు జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతింది. రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. ఆరు అడుగుల ఎత్తులో ఉండే సైడ్‌ డ్రైనేజీలు సైతం వరదదాటికి కొట్టుకుపోయాయి. ముప్పారం రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోక లు నిలిచిపోయాయి. సందట్లో సడేమియా అన్న చందంగా నర్సింహులగూడెం వరద నీటిలో పలువురు చేపల వేట సాగిస్తున్నారు. వరద కారణంగా విద్యుత్‌ శాఖకు రూ.25 లక్షల నష్టం వాటిల్లింది. నిడమనూరు, నర్సింహులగూడెం, వెనిగండ్ల, రాజన్నగూడెం గ్రామాల్లో 20 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. పలు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ పునరుద్దరించి రైతులకు కరెంటు ఇచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. పొలాలు ఇంకా నీటిలో మునిగి ఉన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. తమ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు. 200ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని వ్యవసా య అధికారులు చెబుతున్నారు. పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. నిడమనూరులోని ఎస్టీ బాలికల మినీ గురుకులం బురదమయంగా మారిం ది. బాలికలను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. వరదల కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున పలు పాఠశాలల్లో పీహెచ్‌సీ సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురుకులాన్ని రీజనల్‌ కోఆర్డినేటర్‌ లక్ష్మయ్య సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. గురుకులాన్ని పెద్దవూరలో పక్కా భవనంలోకి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా గండి పడిన ప్రాంతాన్ని, వరద ప్రాంతాలను సీఎం ఓఎ్‌సడీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఎమ్మెల్యే నోముల భగత్‌, బీజేపీ జిల్లా అధ్య్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నివేదితారెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ చంద్రమోహన్‌, డీఈ వెంకటేశ్వర్లు, జేడీఏ సుచరిత, సీపీఎం నాయకులు పరిశీలించారు.


ఐదారు రోజుల్లో ఎడమకాల్వ నీటిని పునరుద్ధరిస్తాం 

మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

నల్లగొండ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఐదారు రోజుల్లో కాల్వ నీటి విడుదల పునరుద్ధరిస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎడమ కాల్వలో నీరు నిండుగా ఉండటంతో పాటు నీటి మధ్యలో బుంగ పడటం వల్లే సాగర్‌ ఎడమ కాల్వ ప్రమాదాన్ని గుర్తించలేకపోయినట్లు తెలిపారు. కాల్వకట్ట పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గండి పడిన ఐదు నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు ఆ ప్రదేశానికి చేరుకోవడంతో పాటు నీటిని ఆపడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సాగర్‌ ఎడమకాల్వ నుంచి నీటి విడుదల నిలిపివేశామని, ఐదు రోజుల్లో పనులు పూర్తిచేసి నీటి విడుదల పునరుద్ధరిస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని కూడా యుద్ధ ప్రాతిపదికన బయటకు పంపినట్లు తెలిపారు. అకాల వరదతో అదృష్టవశాత్తు పెద్దగా ప్రమాదం జరగలేదన్నారు. నష్టపోయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారని, బాధితులను ఆదుకుంటామని తెలిపారు.


ఐదెకరాల పంట నష్టపోయా

ఐదెకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశా. ఇప్పటికే రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టాను. నాట్లు కూడా వేశా. కానీ కాల్వకట్ట తెగడంతో వరద కారణంగా పంట పూర్తిగా దెబ్బతినడంతో నష్టపోయా. పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.

పోలేపల్లి మోష, కౌలు రైతు, శాఖాపురం


గాలి మిషన్లు సామాన్లు కొట్టుకుపోయాయి

నర్సింహులగూడెం వద్ద గాలి మిషన్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నా. ఎడమ కాల్వకు గండి పడటంతో వచ్చిన వరదలో నా గాలి మిషన్‌ వస్తువులు, టైర్లు కొట్టుకుపోయాయి. రూ.లక్ష వరకు నష్టం జరిగింది. రోజువారి వచ్చే ఆదాయంతో బతుకుతున్న నాకు ప్రభుత్వం సహాయం చేయాలి.

రాపర్తి నాగార్జున, ముప్పారం


పందెం కోళ్లు చనిపోయాయి

బతుకుదెరువు కోసం రైస్‌ మిల్లు లీజుకు తీసుకొని నడిపిస్తున్నా. కాల్వకట్ట తెగడంతో ఒక్కసారిగా వరద వచ్చి మిల్లులో చేరింది. బియ్యం, సిమెంటు బస్తాలతో పాటు వరిపొట్టు కూడా వరదలో కొట్టుకుపోయింది. మిషనరీ మొత్తం తడిసింది. ఒక్కోటి రూ.15 వేలు విలువ చేసే 10 పందెం కోళ్లు సైతం వరదతాకిడికి చనిపోయాయి. రూ.6లక్షల నష్టం వాటిల్లింది.

మిల్లు రాజు, నిడమనూరు

Updated Date - 2022-09-09T06:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising