ఘనంగా ఎస్పీటీ మార్కెట్ వార్షికోత్సవం
ABN, First Publish Date - 2022-08-13T06:01:08+05:30
వస్త్ర రంగంలో విశేష సేవలందిస్తున్న జిల్లా కేంద్రంలోని వస్త్ర మార్కెట్ ఎస్పీటీ మార్కెట్ 33వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ టౌన, ఆగస్టు 12: వస్త్ర రంగంలో విశేష సేవలందిస్తున్న జిల్లా కేంద్రంలోని వస్త్ర మార్కెట్ ఎస్పీటీ మార్కెట్ 33వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ మర్చంట్ కమిటీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మార్కెట్లోని వ్యాపారులు, వినియోగదారులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన చిలువేరు చంద్రయ్య మాట్లాడుతూ వివాహ శుభకార్యాలకు ఒకేచోట షాపింగ్ చేసే వస్త్ర మార్కెట్ ఎస్పీటీ మార్కెట్ అని అన్నారు. పట్టు ఫ్యాన్సీ, రెడీమేడ్, ఎథ్నిక్ వేర్, కిడ్స్, వనగ్రాం గోల్డ్ ఎంపోరియం, డ్రెస్ మెటీరియల్ అందుబాటులో ఉంటాయన్నారు. వినియోగదారులు మార్కెట్‌ను మరిం త ఆదరించి ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీటీ మార్కెట్ ట్రస్ట్ అధ్యక్షుడు మిర్యాల సోమయ్య, అధ్యక్షుడు జెల్లా గణేష్, కార్యదర్శి పెండెం వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు జెల్లా రవికుమార్, కోశాధికారి గంజి వెంకటేశం, సభ్యులు సంగిశెట్టి నర్సింహ, మారెపల్లి శ్రీనివాసులు, రాపోలు రవి, సంగెం విష్ణు, సుంకి మనోహర్, జెల్లా లవణ్‌కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-13T06:01:08+05:30 IST