ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణనీయంగా ప్రకృతి వనాలు పెంచాలి

ABN, First Publish Date - 2022-05-20T06:01:10+05:30

ఇరిగేషన్‌ భూముల్లో గణనీయంగా ప్రకృతి వనాలు పెంచాల ని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 19: ఇరిగేషన్‌ భూముల్లో గణనీయంగా ప్రకృతి వనాలు పెంచాల ని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఇరిగేషన్‌ అఽధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌తో కలసి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న అన్ని ఇరిగేషన్‌ కాల్వలకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలన్నారు. 2,400 ఎకరాల ఇరిగేషన్‌ భూముల పరిధిలో ప్రకృతి వనాలు పెంచాలన్నారు. అధికారులు మండలాల్లో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులు, కూలీలకు చెల్లింపులు, పంచాయతీల్లో నర్సరీలను పరిశీలించాలన్నారు. మండలాలు, పంచాయతీల్లో ఏర్పాటు చేసే ప్రకృతి వనాల పర్యవేక్షణ బాధత్య ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలపై ఉందన్నారు. నర్సరీల్లో ఇప్పటికే కోటి మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి మొక్కలు తెప్పిస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఈలు నాగేశ్వర్‌రావు, నర్సింహారావు, భద్రునాయక్‌, విజయ్‌కుమార్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising