ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు విస్తరణ 80 అడుగులకు కుదింపు

ABN, First Publish Date - 2022-12-16T01:19:41+05:30

మోత్కూరు మునిసిపాలిటీలో రోడ్డు విస్తరణను 80 అడుగులకు కుదించారు. మెయిన్‌రోడ్డు విస్తరణ 100 అడుగుల వెడల్పుతో చేస్తే చాలా కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే గృహ, దుకాణాల యజమానుల కోరిక మేరకు 80 అడుగుల వెడల్పుకు కుదించాలని ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ సూచన మేరకు మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానించినట్టు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరులో అఖిలపక్ష సమావేశంలో తీర్మానం

మోత్కూరు, డిసెంబరు 15: మోత్కూరు మునిసిపాలిటీలో రోడ్డు విస్తరణను 80 అడుగులకు కుదించారు. మెయిన్‌రోడ్డు విస్తరణ 100 అడుగుల వెడల్పుతో చేస్తే చాలా కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే గృహ, దుకాణాల యజమానుల కోరిక మేరకు 80 అడుగుల వెడల్పుకు కుదించాలని ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ సూచన మేరకు మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానించినట్టు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి తెలిపారు. గురువారం మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన అఖిలపక్ష, గృహ యజమానుల సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. రోడ్డు విస్తరణలో పాక్షికంగా గాని, పూర్తిగా గాని ఇళ్లు కోల్పోతున్న కుటుంబాల పరిస్థితిని ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లి వారి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు లేదంటే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. రోడ్డు మధ్య నుంచి 40 అడుగుల లోపు ఉన్న నిర్మాణాలను గృహ, దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా సాధ్యమైనంత త్వరగా తొలగించుకోవాలన్నారు. తొలుత ఇళ్లు కోల్పోతున్నవారు, వివిధ పార్టీల యజమానులు మాట్లాడుతూ ఇళ్లు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని, పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారు తిరిగి వేరేచోట ఇల్లు నిర్మించుకోవడానికి ఉచితంగా అనుమతి ఇవ్వాలని, డివైడర్‌ నిర్మాణంలో యూటర్న్‌లు తగ్గించాలని డిమాండ్‌చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ సి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ మునిసిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో మోత్కూరు రెండో దశలో ఉందని, ఇప్పుడు రోడ్డు విస్తరణ జరిగితే మరో 20 ఏళ్ల వరకు వెడల్పు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని, డివైడర్‌ నిర్మాణంలో యూటర్న్‌లు తగ్గిస్తామని, పూర్తి ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి ఇంటి నిర్మాణానికి చెల్లించాల్సిన ఫీజులో కొంత రాయితీ ఇస్తామన్నారు. అంతకుముందు రోడ్డు విస్తరణ కుదింపుపై అధికారులు, నిర్వాసితుల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కళ్యాణ్‌చక్రవర్తి, మలిపెద్ది రజిత, కోఆప్షన్‌ సభ్యులు గనగాని నర్సింహ, ఎంఏ నబి, వివిధ పార్టీల ప్రతినిధులు బయ్యని రాజు, అవిలిమల్లు, సోమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising