TS News: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత
ABN, First Publish Date - 2022-09-22T13:54:56+05:30
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna sagar project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,25,592 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,99,137 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా కొనసాగుతోంది.
Updated Date - 2022-09-22T13:54:56+05:30 IST