ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్‌-ఏ గ్రేడ్‌ గుర్తింపు

ABN, First Publish Date - 2022-04-20T06:33:25+05:30

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్‌ 3వ సైకిల్‌లో భాగంగా ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది.

నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండటౌన, ఏప్రిల్‌ 19: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్‌ 3వ సైకిల్‌లో భాగంగా ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది. ఈ నెల 12, 13వ తేదీల్లో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాక్‌ బృందం కళాశాలలో పర్యటించి అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ గ్రేడ్‌ పొందిన కళాశాల్లో రాష్ట్రంలోనే 3వ కళాశాలగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు గుర్తింపు లభించింది. దీనిద్వారా యూజీసీ నుంచి మరిన్ని నిధులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఘనశ్యామ్‌ మాట్లాడుతూ ఏ గ్రేడ్‌ సాధించడానికి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం ఎంతో కృషి చేశారని తెలిపారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్‌.రాజారాం, జె.భాస్కర్‌రెడ్డి, జ్యోతి, శ్రీనివా్‌సరెడ్డి, వెంకటేశ్వర్లు, అపర్ణ చతుర్వేది, వెంకటరామారావు, దేవపాని పాల్గొన్నారు.    


Updated Date - 2022-04-20T06:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising