ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూవివాదంతో పరస్పరం దాడి

ABN, First Publish Date - 2022-05-24T07:37:55+05:30

భూవివాదం నేపథ్యంలో రెండు వర్గాలు పర స్పరం దాడి చేసుకోవడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం...

జంపల్లి చందుగాని తండాలో కర్రలతో దాడి చేసుకుంటున్న ఇరువర్గాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8మందికి గాయాలు

బీబీనగర్‌, మే 23: భూవివాదం నేపథ్యంలో రెండు వర్గాలు పర స్పరం దాడి చేసుకోవడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... బీబీనగర్‌ మండలం జంపల్లి గ్రామ పంచాయతీలోని చందుగానితండాలో దేవాసత్‌ సూర్య దేవాసత్‌ నవీన్‌, దేవాసత్‌ రాజు, నర్సింహ, హరి, శ్రీకాంత్‌లకు సర్వే నెం.40 నుంచి 50లో వారసత్వంగా 32 ఎకరాల భూమి వచ్చింది. ఇదే భూమిపై ఇదే తండాకు చెందిన దేవాసత్‌ రామా, దేవాసత్‌ రెడ్యా చంద్రు, ఆర్య, దేవా దేవేందర్‌, బాబురావు, అమృ, కిషన్‌ల మధ్య ఏడాది కాలంగా వివాదం ఉంది. పెద్దల్లో పంచాయితీ పెట్టినప్పటికి వివాదం పరిష్కారం కాలేదు దీంతో కొన్ని రోజులుగా ఆ భూమిలో సేద్యం పనులు నిలిపివేశారు. ఈ భూమిపై అన్ని హక్కులు తమకే ఉన్నాయంటూ దేవాసత్‌ సూర్య ఈనెల 22వ తేదీ సాయంత్రం ఆ భూమిలో సాగు చేసేందుకు పనులు మొదలు పెట్టారు. దీంతో విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన దేవసత్‌ రామ, రెడ్య తదితరులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం పెరిగి కర్రలతో  పరస్పరం దాడి చేసుకు న్నారు. ఈ దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సూర్య, నవీన్‌, రాజులకు తీవ్రగాయాలు కావడాంతో బోడుప్పల్‌లోని స్పార్క్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు  బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో  పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.




Updated Date - 2022-05-24T07:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising