ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్‌ను అరికట్టడంలో ముందుండాలి

ABN, First Publish Date - 2022-06-27T07:08:21+05:30

ప్రాణాంతకమైన డ్రగ్స్‌ను అరికట్టడంలో యువత ప్రధాన పాత్ర పోషించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేకం దినం సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని కాసరబాద సమీపంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు.

సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటరూరల్‌, జూన్‌ 26: ప్రాణాంతకమైన డ్రగ్స్‌ను అరికట్టడంలో యువత ప్రధాన పాత్ర పోషించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేకం దినం సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని కాసరబాద సమీపంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. యువత డ్రగ్స్‌, మత్తుకు అలవాటుపడి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌, గంజాయి తదితర మాదకద్రవ్యాల కారణంగా సమాజంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు. డ్రగ్స్‌ను రూపుమాపేందుకు యువతలో సామాజిక బాధ్యత పెరగాలన్నారు. శిక్షణలో ఉన్న అభ్యర్థులు పోలీ్‌సశాఖలో ఉద్యోగం సాధించి డ్రగ్స్‌ నివారణకు సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం యువకులతో డ్రగ్స్‌ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, సీఐ లు విఠల్‌రెడ్డి, ఆంజనేయులు, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, శిక్షణ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌ఐలు గోవిందరావు, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T07:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising