ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

By-election: మునుగోడుకు కాంగ్రెస్ ఇన్చార్జులు వీళ్లే...

ABN, First Publish Date - 2022-08-16T16:51:01+05:30

మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ (Congress) వ్యూహాలు రచిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు (Munugodu) సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ (Congress) వ్యూహాలు రచిస్తోంది. మండలాలవారిగా ఇన్చార్జులను నియమించింది. కేడర్ చేజారకుండా శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపి ఉత్సాహంతో పనిచేసేలా ప్రొత్సహించడమే లక్ష్యంగా మంగళవారం నుంచి భేటీలు నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించనున్న పాదయాత్ర నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇన్చార్జులను నియమించారు. చౌటుప్పల్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి; నారాయణపూర్: బలరాం నాయక్, గండ్ర సత్యనారాయణ; మునుగోడు: సీతక్క, విజయ రామారావు; నాంపల్లి: అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి; గట్టుప్పల్: ఎస్ఏ సంపత్ కుమార్, ఆది శ్రీనివాస్; చండూరు: ఈరవత్రి అనిల్, డాక్టర్ వంశీకృష్ణ; మర్రిగూడ: చెరకు సుధాకర్, వేం నరేందర్ రెడ్డిని నియమించారు.


వారంతా తమ మండలాల పరిధిలోని పార్టీ నాయకులతో సమావేశమవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న నాంపల్లి, మర్రిగూడ.. 17న ఆశావహులతో సమావేశం... 18న మునుగోడు, చండూరు..19న సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం ఒక మండలం, సాయంత్రం మరో మండలంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికలో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహం, కేడర్‌ను, ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం, ఎన్నిక పూర్తయ్యేవరకు ప్రతి గ్రామానికి 8 మందితో ఒక కమిటీ వేయడం.. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి ఎజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి.

Updated Date - 2022-08-16T16:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising