ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూసీ కాలుష్యం ఆరోగ్యానికి హానికరం

ABN, First Publish Date - 2022-07-05T05:47:42+05:30

మూసీ కాలుష్యం పరీవాహక ప్రాంత ప్రజల ఆరోగ్యానికి, అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని అఖిల భారత కిసాన్‌ సంఘం(ఏఐకేఎస్‌) జాతీయ ఉపాధ్యక్షుడు సారపల్లి మల్లారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి 

భువనగిరి టౌన్‌, జూలై 4: మూసీ కాలుష్యం పరీవాహక ప్రాంత ప్రజల ఆరోగ్యానికి, అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని అఖిల భారత కిసాన్‌ సంఘం(ఏఐకేఎస్‌) జాతీయ ఉపాధ్యక్షుడు సారపల్లి మల్లారెడ్డి అన్నారు. ‘మూసీ కాలుష్యం- ప్రత్యామ్నాయ వనరులు’ అనే అంశంపై సీపీఎం ఆఽధ్వర్యంలో సోమవారం భువనగిరిలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ కాలుష్య నివారణకు ప్రభుత్వం గతంలో ప్రకటించిన కార్యాచరణను అమలు చేయాలని, పలు పరిశ్రమలు రసాయనిక వ్యర్థాలను మూసీలోకి వదలకుండా కఠిన చర్య లు తీసుకోవాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 60వేల ఎకరాల్లో పంట సాగవుతున్నా కలుషిత పంట ఉత్పత్తి అవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన చేపడుతూనే పరీవాహక ప్రాంతానికి గోదావరిజలాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీనియర్‌ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌, పీస్‌ సంస్థ వ్యవస్థాపకులు కె. నిమ్మయ్య, వైఎస్సీర్‌టీపీ జిల్లా కోఆర్డినేటర్‌ ఎండీ. అథహర్‌ మాట్లాడారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు భట్టు నర్సింగ్‌రావు, ఏశాల అశోక్‌, బీసుకుంట్ల సత్యనారాయణ, భట్టు రాంచంద్రయ్య, మంగ నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising