ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగదీకరణ ఆర్థిక స్వావలంబనకు చేటు

ABN, First Publish Date - 2022-07-05T06:14:58+05:30

జాతీయ నగదీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఆస్తుల అమ్మకం ప్రజల ఆర్థిక స్వాలంబనకు చేటుగా పరిణమిస్తోందని సీఐటీ యూ జాతీయ కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. ఆలిండియా రైల్వే కాంట్రా క్టు ఎంప్లాయిస్‌ కో-ఆర్డినేటర్‌ రమేశ్‌బాబుతో కలిసి రైల్వే కార్మికుల సమస్యల పై సోమవారం చర్చించారు. అనంతరం సీఐటీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జాతీయ కార్యదర్శి సాయిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగస్టు 14న దేశవ్యాప్త కార్మిక జాగరణ

సీఐటీయూ జాతీయ కార్యదర్శి సాయిబాబు

మిర్యాలగూడ, జూలై 4: జాతీయ నగదీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఆస్తుల అమ్మకం ప్రజల ఆర్థిక స్వాలంబనకు చేటుగా పరిణమిస్తోందని సీఐటీ యూ జాతీయ కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. ఆలిండియా రైల్వే కాంట్రా క్టు ఎంప్లాయిస్‌ కో-ఆర్డినేటర్‌ రమేశ్‌బాబుతో కలిసి రైల్వే కార్మికుల సమస్యల పై సోమవారం చర్చించారు. అనంతరం సీఐటీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సహజ వనరులతోపాటు, ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు విక్రయించి రూ.110లక్షల కోట్లు ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. తొలి విడతగా రూ.6లక్షల కోట్ల కోసం విక్రయాలు ప్రారంభించిందన్నారు. వీటిని ప్రపంచ కుబేరుల జాబితాలో పేరు న్న ఆదాని, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. దేశ ప్రజల కష్టంతో ఏర్పాటుచేసిన ప్రభుత్వరంగ సంస్థలతోపాటు వారసత్వ సంపదలను కార్పొరేట్ల కు అప్పగించడం ద్వారా ప్రజల ఆర్థిక స్వావలంబనకు చేటు కలుగుతుందన్నా రు. శ్రీలంకలో సంభవించిన పరిణామాలు దేశంలో చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. మరో వైపు బ్రిటీష్‌ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించుకు న్న 29 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి హక్కులను కాలరాసేందు కు కుట్ర చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులను జాగృతం చేసేందుకు ఆగస్టు 1 నుంచి 15 వరకు దేశ వ్యాప్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు 14న ‘సేవ్‌ ద నేషన్‌ - సేవ్‌ ద పీపుల్‌’ కార్యక్రమంలో భాగంగా సామూహిక కార్మిక జాగరణ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, హమాలీ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రాంమూర్తి, నాయకులు మల్లు గౌతంరెడ్డి, ఎండి.అంజద్‌, పలు కార్మిక విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising