ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌భగీరథను గంగలో కలిపారు

ABN, First Publish Date - 2022-03-05T06:47:26+05:30

మిషన్‌ భగీరథ పథకం అమలు తీరుపై శుక్రవారం నిర్వహించిన జడ్పీ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖపై సభ్యుల మండిపాటు

పలు అంశాలపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చ 


నల్లగొండ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  మిషన్‌ భగీరథ పథకం అమలు తీరుపై శుక్రవారం నిర్వహించిన జడ్పీ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ, కరోనా సమయంలోనూ రాష్ట్రాభివృద్ధి జరగడం సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు. అంతకుముందు ప్రధానంగా తాగునీటిపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పథకాన్ని గంగలో కలిపారంటూ సభ్యులు ధ్వజమెత్తారు. వేసవిలో మరెన్నో ఇబ్బందులు వస్తాయోనంటూ అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నీరు విడుదల చేయటం లేదన్నారు. 25 రోజులుగా పైప్‌లైన్‌ లీక్‌ అవుతున్న పట్టించుకోవడం లేదన్నారు. రైతులు అభ్యంతరం చేసినా పైప్‌లైన్‌లు వేయకుండా ఉండవద్దని అసెంబ్లీలోనే చట్టం చేశారన్నారు. ఈ సమయంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ స్పందిస్తూ ఏవైనా సమస్యలు వస్తే పోలీస్‌ ఫోర్స్‌ను పెట్టుకొని పనులు  పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిడమనూరు మండల కేంద్రంతో పాటు దాసరపల్లి, చర్లతండాతో పాటు మునుగోడు మండలం కృష్ణాపురం,అడవిదేవలపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యలు చాలా ఉన్నాయని సభ్యులు తెలిపారు. 


గురుకుల పాఠశాలల్లో పైసా వసూల్‌

బీసీ, ఎస్సీ, ఎస్టీ  గురుకులాల్లో డ్రాపౌట్స్‌ స్థానాల్లో సీట్ల భర్తీకి ప్రజాప్రతినిధులు లేఖలు రాసినా కనీసం ఒక్క సీటు ఇవ్వలేదని జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్యె ల్యే రవీంద్రకుమార్‌తో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎం పీపీలు ఆరోపించారు. ఆర్‌సీవోలు కనీసం ఫోన్‌లు కూడా ఎత్తడంలేదన్నారు. కుల, విద్యార్థి సంఘాలు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి సీట్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఈ విషయం పలువురు సభ్యులు మాట్లాడుతూ ఒక్కో సీటుకు రూ.20వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సీట్లు భర్తీ చేయడం బంద్‌ కావాలని చైర్మన్‌ అన్నారు. గుర్రంపోడు మండల కేంద్రం నుంచి నాంపల్లికి వెళ్ళే దారిలో ఓ వ్యక్తి అక్రమంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడుతున్నారని సభ్యురాలు ఆరోపించారు. 466 సర్వేనెంబర్‌ పక్కన ప్రభుత్వ భూమి ఉందని కల్వర్టును మూసివేసి నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ స్పందిస్తూ తక్షణమే ఆ ప్రాంతాన్ని పరిశీలించి, చర్యలు తీససుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో పీహెచ్‌సీలు నడిచిన విధంగానే ప్రతి రోజూ నడవాలని డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్నారు. సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న పీహెచ్‌సీ భవనాలను పునఃనిర్మించాలన్నారు. మన  ఊరు-మన బడి ప్రణాళికలో భాగంగా జిల్లాలో 517 పాఠశాలను ఎంపిక చేసి 12 రకాల అంశాలపై మౌలిక వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్‌  ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. దీనిపై జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పాశం రాంరెడ్డి మాట్లాడుతూ మొదట పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, సీఈవో వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ పాల్గొన్నారు. 


గట్టుప్పల మండలం ఖాయం : మంత్రి  

చండూరు రూరల్‌, మునుగోడు: గట్టుప్పల్‌ను మండలం చేయాలన్నది సీఎం కేసీఆర్‌ నిర్ణయమని, త్వర లో ఇది ఖాయమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. చండూ రు మండల పరిధిలోని గట్టుప్పల, మునుగోడు మండల కేంద్రంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గట్టుప్పల మండలం కొన్ని కారణాలతో నిలిచిందని, త్వరలో ఇక్కడి ప్రజల కోరిక నెరవేరుతుందన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తోకల చంద్రకళ, జడ్పీటీసీలు స్వరూపరాణి, కర్నాటి వెంకటేశం, పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising