మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలి
ABN, First Publish Date - 2022-08-03T06:07:04+05:30
ప్రజాఆకాంక్షను గౌరవించి మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా సాధనకమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రౌండ్‌టేబుల్ సమావేశంలో జిల్లా సాధన కమిటీ నిర్ణయం
మిర్యాలగూడ, ఆగస్టు 2 : ప్రజాఆకాంక్షను గౌరవించి మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా సాధనకమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం జిల్లా సాధనకమిటీ ముఖ్యబాధ్యులంతా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్‌ఫోరం రాష్ట్రకన్వీనర్ కస్తూరి ప్రభాకర్, బీఎస్పీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జాడి రాజు మాట్లాడారు. వ్యాపార, వాణిజ్య రంగాలు విస్తరించి భౌగోళి కంగా జనాభాపరంగా విస్తరించిన మిర్యాలగూడ ప్రాంతంపై వివక్ష సరికాదన్నారు. మిర్యాలగూడను జిల్లాకేంద్రంగా గుర్తించకపోవడం తీరని అన్యాయమన్నారు. బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మండలంగా ప్రకటించాలని అమ్మనబోలు గ్రామస్థుల వినూత్న నిరసన
నార్కట్‌పల్లి, ఆగస్టు 2: అమ్మనబోలును మండలంగా చేయాలనే డిమాండ్‌తో రోజుకో తీరుగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తున్న మండల సాధన సమితి మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. అమ్మనబోలుతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ప్రాణాధారంగా మారిన మూసీనది వరద నీటికి పూలను సమర్పించి తమ నిరసన తెలిపారు. అనంతరం వాగు ఒడ్డునే ఇటీవలే నూతనంగా పునఃనిర్మాణమైన గంగ దేవమ్మ తలికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల సాధన సమితి నేతలు పాల్గొన్నారు. అమ్మనబోలును మండలం గా ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్ట సత్యం డిమాండ్ చేశారు. పల్లెపహాడ్‌లో సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిల్వేరు జానయ్య, నాయకులు శంభ య్య, నర్సింహ్మా, నోముల రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-03T06:07:04+05:30 IST