ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉద్యమకారులకు న్యాయం కోసమే విలీనం’

ABN, First Publish Date - 2022-08-08T06:00:37+05:30

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగేందుకే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రె్‌సలో విలీ నం చేసి ఆ పార్టీలో చేరినట్లు డాక్టర్‌ చెరుకు సు ధాకర్‌ తెలిపారు.

సుధాకర్‌ను సన్మానిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకిరేకల్‌, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగేందుకే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రె్‌సలో విలీ నం చేసి ఆ పార్టీలో చేరినట్లు డాక్టర్‌ చెరుకు సు ధాకర్‌ తెలిపారు. నకిరేకల్‌లోని ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేందుకు ప్ర త్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా తనను నియమిస్తానని రేవంతరెడ్డి హామీ ఇవ్వడంతోనే కాంగ్రె్‌సలో చేరానని, ఎలాంటి స్వలాభం కోసం చేరలేదని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు శాలిగౌరారం కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు నూక సత్తయ్యయాదవ్‌, నా యకులు అన్నెబోయిన సుధాకర్‌, బండమీది రమేష్‌, నరేష్‌, విజయ్‌, మహేష్‌, ఎంపీటీసీ సైదమ్మ శ్రీనివాస్‌, భాస్కర్‌, రాందాసు, కిషోర్‌, సంపత పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T06:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising