ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ బోర్డు విధానాన్ని రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-09-20T05:19:42+05:30

కల్లుగీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో విధించిన మెడికల్‌ బోర్డు విధానా న్ని వెంటనే రద్దు చేయాలని గీత వృత్తి పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

ఆలేరులో మాట్లాడుతున్న ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలేరు / తుర్కపల్లి,  సెప్టెంబరు 19 : కల్లుగీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో విధించిన మెడికల్‌ బోర్డు విధానా న్ని వెంటనే రద్దు చేయాలని గీత వృత్తి పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఆలేరులోని టీఎన్‌జీవో భవనంలో సోమవారం నిర్వహించిన సంఘం జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా నాయకులు గోద శ్రీరాములు బొలగాని సత్యనారాయణ, గాజుల యాదయ్య, దామోదర్‌, పబ్బు యా దయ్య, ఐలి సత్తయ్య, మాణిక్యం, వెంకట్‌  పాల్గొన్నారు. అదేవిధంగా తుర్కపల్లి మండల కేంద్రంలో గీత కార్మిక సంఘం మండల సమావేశం నిర్వహించారు. గౌడ కులస్థులకు గీత న్న బంధు ప్రకటించి ఆదుకోవాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు డిమాండ్‌ చేశారు. సమావేశం అనంతరం సంఘం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు కోక్కొండ లింగయ్య, నూతన అధ్యక్షుడు మారగోని శ్రీరాంమూర్తి, గౌరవ అధ్యక్షుడు కొండెం రఘురాములు, ప్రధాన కార్యదర్శి గడ్డమీది నిఖిల్‌, కోశాధికారి కూరెళ్ల రాజాలు, ఉపాధ్యక్షుడు కిష్టయ్యతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-20T05:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising